Posts

బంగార్రాజు

బంగార్రాజు ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. ***************************************************************************** బంగార్రాజు అంటే మా ఊరి సోగ్గాడు. పేరుకు తగ్గట్టే ఒంటి నిండా ఆడోళ్ళ కంటే ఎక్కువగా నగలేసుకుని ఉంటాడు. సూడ్డానికి సినిమా హీరో శోభన్ బాబు లెక్క ఉండేటోడు. ఆరు అడుగుల ఎత్తు, ఉంగరాల జుట్టు, మాంచి రంగు, ఓ వందెకరాల పొలం ఇంకేముంది బంగార్రాజు సోగ్గాడే కాదు ఊళ్ళో అమ్మాయిలకు హీరో. బంగార్రాజుని వాళ్ళ నాన్న పట్నంలో ప్రైవేటు బడిలో సదివించాడు. ఆడికోచ్చే మాత్రపు ఇంగిలీసు ఊళ్ళో ఎవరికీ రాదు కాబట్టి ఆడు మాట్టాడుతంటే 'సూసి నేర్సుకొండ్రా' అని సేప్పెటోల్లు. అసలు బంగార్రాజు సెలవలకు ఊరికోచ్చాడంటే, వీధిలోకి ఓ పిట్టల దొరలా తయారయ్యి వచ్చేటోడు. జీను ప్యాంటు, టీ సోక్కా, నెత్తిన టోపీ (అది సలికాలమైనా సరే), ఆక్షన్ షూస్, నడుము బెల్ట్ కి వాక్ మాన్ పెట్టుకుని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరిగేటోడు. పగటి యాల ఎక్కడ తిరిగినా సాయంత్రమయ్యేసరికి సెరువు గట్టు కాడ తేలేటోడు, అక్కడ బేవార్స్ బాచ్ తో కూచుని పొలాల నుంచి వచ్చే ఆడోల్లపై సటైర్లు యె...

చదరంగంలో పావు

వంశీ కలుగోట్ల // ... చదరంగంలో పావు // ముందు మాట:    ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. ప్రతి రాజకీయ పార్టీ రైతులు అంటే కేవలం ఎలక్షన్స్ టైం లో పనికొచ్చే పావులుగానే పరిగణిస్తోంది. రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయిన/మిగిలిపోయిన రైతు వ్యధని వ్యక్తీకరించటానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది. అంశం పెద్దది, కానీ చిన్న కథగా ముగించాలని ముందే నిర్ణయించుకోవడంతో పరిధిమేరకు కుదించుకోవాల్సివచ్చింది.  **********************************************************************************             సంకురేత్తిరి పండగొత్తన్నాది, ఊరంతా సంబరంగా ఉంది. కూతుళ్ళని, అల్లుళ్ళని పిల్సుకుని పండగ మస్తుగా సేస్కోనీకి అందరు తయారవుతున్నారు. ఊరందరూ ఈసారి పెద్దరెడ్డి ఎడ్లు పందెంలో గెలస్తయా లేదా అని పందాలు కాసుకుంటన్నారు. మా ఇంట్ల మాత్రం పండగలెక్క లేదు ... ఉన్న ఒక్క కూతుర్ని పిలవాలంటే అల్లుడు ఏమడుగుతడో అని భయం. పిలవకపోతే పిల్ల బాధపడతని దుఖం. అందుకే ఈ మద్దెన పండగలు, పబ్బాలోత్తన్నాయంటే సంబరానికంటే ఎక్కువ భయమైతాంది.మూడేళ్ళ కాట్నించి సంవత్సరం...

చిరునవ్వుకు మరణం లేదు

వంశీ కలుగోట్ల // ...  చిరునవ్వుకు మరణం లేదు // ముందు మాట:  ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించినవీ కావు. *********************************************************************************             ఇవాళ సడన్ గా ఎందుకో గురువు గారు గుర్తొచ్చారు. గురువు గారు అంటే ఏ సన్యాసో, సాధువో, మహాత్ముడో కాదు. మా స్నేహితుడు మౌళి. సరదాగా అందరం గురువు గారు అని పిలుస్తుంటాం. గురువుగారు రాగానే, మనసు అలా ఓ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ...  *                *                 *           మా క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో మౌళి ఒక డిఫరెంట్ పర్సన్. మా గ్రూప్ లోకి వాడో లేక వాడి గ్రూప్ లోకి మేమో రాంగ్ అడ్రెస్స్ అనుకుంటుంటాం. కానీ, అలా అలవాటైపోయామంతే. వాడు ఎపుడూ ఒక ఊహ ప్రపంచంలో ఉండేవాడు, ఏవేవో ఆదర్శాలూ అంటూ చెప్పేవాడు. మేమంతా మేము ప...

రేడియో మూగబోయింది

వంశీ కలుగోట్ల // రేడియో మూగబోయింది // ************************************** ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. 1990 ద్వితీయార్ధం మరియు కొన్ని సంవత్సరాల కాలం క్రితం నాటి పరిస్థితులను రైతు నేపథ్యంలో వ్యక్తీకరించాను.     *            *            *           మాది ఒక మారుమూల పల్లెటూరు. దేశంలోని అనేక పల్లెటూర్లలో మాదీ ఒకటి. 'పల్లెటూర్లు దేశానికి పట్టుగొమ్మలు' అన్న మాటకు ఉబ్బిపోవడం తప్ప అది ఏ విధంగానో ఎప్పుడూ అర్థం కానీ మామూలు రైతు కుటుంబం మాది. విత్తనం వేసాక వర్షం కోసం ఆకాశం వైపు, పంట చేతికొచ్చాక కొనేవాడు ఎప్పుడొస్తాడో అని రోడ్డు వైపు చూడటం అలవాటైపోయిన గానుగెద్దుల్లాంటి బతుకులు మావి. అలాంటి వాళ్ళలో రేడియో గాడు ఒకడు. వాడి పేరేమిటో మాకైతే తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు. రేడియో గాడు అని తప్ప ఇంకో రకంగా ఎవరికీ తెలీదు. పొరపాటున వాడి అసలు పేరు గుర్తున్న వాళ్లెవరైనా ఆ పేరుతొ పిలిచినా వాడు పలకడు, అంతగా వాడికి కూడా అలవాటైపోయింది ఆ పేరు. ...

నువ్వు దేవుడివి సామీ

వంశీ కలుగోట్ల // ... నువ్వు దేవుడివి సామీ // ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. ******************************************************************************* "సామీ నువ్వు గోప్పోడివి సామీ. నీ లెక్కటోల్లు ఈ రోజుల్లో యాడుంటారు సామీ? దేవుడి లెక్కటోండివి సామీ" "అరేయ్ సాంబడూ ఆపరా నీ స్తోత్రాలు. అదేదో పోయి ఆ సారా కొట్టు కిట్టయ్య గాడి దగ్గర చదివితే వాడు కనీసం కొంచం సారా అయినా పోస్తాడు. పోరా" "సామీ ఆడు సారా పోయ్యాలంటే సెయ్యి తడపాల్సిందే. పది రూపాయలుంటే ఇయ్యరాదు. నాలుక పిడచగట్టుకపోతాంది సుక్కబడక మూన్నాల్లయ్యింది సామీ."             సాంబడి స్తోత్రాలు తప్పించుకోవడానికి అన్నట్టు వాడికి ఓ పది రూపాయలిచ్చి పంపించేసాడు శివయ్య. సాంబడు అంటే మా ఊళ్ళో దండోరా వేసేటోడు. ఊళ్ళో ఏదన్నా వార్త అందరికీ తెలియజేయాలంటే వాడికి ఓ పాతిక రూపాయలిస్తే సాయంకాలం నుండి అర్ధ రాత్రి వరకు ఊరంతా దండోరా కొట్టుకుంటూ 'ఇందుమూలంగా అందరికీ తెలియజేయడమేమనగా ... ' అంటూ వీధి వీధి తిరిగీ సారా కొట్టు దగ్గర ఆగిపోతాడు. సారా కొట్టు కిష్టయ్య ఎప్పుడైతే డబ...

నేనెవరిని

నేనెవరిని ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవీ కావు. ******************************************************************************************** అలవాటైన ప్రాణానికి పని సరిగ్గా లేకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది. మనకిష్టమొచ్చిన పని చెయ్యలేము, చేసే పని నచ్చదు. నచ్చకపోవడమంటే పని చెయ్యడం నచ్చదని కాదు, వేరే ఏదో చెయ్యాలని కోరిక. అలాంటి ఒకానొక సందర్భంలో, టైం పాస్ కాక బోర్ కొట్టి, సొల్లు కబుర్లు చెప్పుకుందామని హైదరాబాద్ లో ఉంటున్న ఫ్రెండ్ రాంబాబుకి ఫోన్ చేశా. ఆఫీసు లో డెస్క్ ఫోన్ కి ఎస్ టి డి సదుపాయం ఉండటం వలన ఎంత అదా అవుతోందో - ఇలాంటి టైం లోనే ఒక గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకునుంటే బాగుండేది అనిపిస్తుంది. ఫోన్ కాల్స్ ఖాతా మొత్తం ఆఫీసు లెక్కలోకి తోసేయ్యచ్చు కదా. రెండు సార్లు వాయిస్ మెసేజ్ కి వెళ్ళాక మూడోసారి కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు మా రాంబాబు గాడు. ఎప్పుడు బోర్ కొట్టినా ఫస్ట్ మా రాంబాబు గాడికే ఫోన్ చెయ్యడం అలవాటు మా ఫ్రెండ్స్ గాంగ్ లో అందరికీ. మామూలుగా ఐతే వాడు పెద్ద నస కానీ ఇలా పిచ్చ బోర్ కొట్టినప్పుడు; మందు పార్టీ లలో మాత్రం వాడే చీఫ్ గెస్ట్ అన...