... తిరుపతి ఉప ఎన్నిక
వంశీ వ్యూ పాయింట్ // ... తిరుపతి ఉప ఎన్నిక // ****************************************** సిట్టింగ్ ఎంపీ దుర్గాప్రసాద్ గారి మరణంతో అనివార్యమైన తిరుపతి ఉప ఎన్నిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి కారణం భాజపా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. ముఖ్యంగా భాజపా తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో కనబరచిన ప్రదర్శనతో ఉరకలెత్తుతోంది. తెలంగాణాలో లాగానే ఇక్కడ కూడా మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టి, మతప్రాతిపదికన ఓట్లను పోలరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. బరిలో ప్రధాన పార్టీల తీరును పరిశీలిస్తే వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న గురుమూర్తి గారికి పార్టీ వర్గాల నుండి సహకారం, వ్యక్తిగతంగా ఎటువంటి చేదు రిమార్క్స్ లేకపోవడం, విద్యాధికుడు, సౌమ్యుడు కావడం వంటివి సానుకూల అంశాలు. కాగా స్థానిక పార్టీ వర్గాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం వంటివి ప్రతికూల అంశాలు. అయితే జగన్ గారు వ్యక్తిగతస్థాయిలో (అంతర్గతంగా) సమీక్షిస్తూ పార్టీ వర్గాలను గురుమూర్తి గారికి అనుకూల