... ఏమంటారో? ఏమనుకుంటారో?
వంశీ కలుగోట్ల // ... ఏమంటారో? ఏమనుకుంటారో? // ****************************** *************** నేను చిన్నపుడు, బహుశా దాదాపు 8 సంవత్సరాల వయసున్నపుడు అనుకుంటా ఒకరోజు పేపర్ లో ఒక వార్త చూశాను - నందికొట్కూరులో ఎవరో చెత్తకుండీలో పడేసిన పసికందును కుక్కలు పీక్కుతిన్నాయన్నది ఆ వార్త. చాలా హృదయవిదారకమైనది, కదిలించివేసింది ఆ వార్త. అది చూసిన చాలారోజుల వరకూ ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉండేది. వివాహేతర లేదా వివాహానికి పూర్వమే ప్రేమ పేరుతొ వంచించబడిన మహిళ, సమాజానికి/కట్టుబాట్లకు భయపడి ఆ బిడ్డను వదిలించుకుందేమో బహుశా. చాలా చాలా బాధతో పాటు, ఆలోచనకూ కారణమైంది. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చేస్తే బావుంటుంది అన్న ఆలోచన మొదలైంది. చదువు కొంతవరకూ మేలేమో అనిపించింది, అంటే చదువుకుంటే అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో. అయితే ఇపుడు కూడా జరుగుతున్న పలు ఘటనలు చూసిన/చదివిన తరువాత చదువు ప్రభావం ప్రస్నార్ధకమే అని అనిపిస్తోంది. సమాజం/కట్టుబాట్ల పట్ల ఉన్న విపరీత భయమే అటువంటి ఘటనలకు కారణం కావచ్చు. ఎవరో ఏమో అనుకుంటారని, తమను తాము అణచేసుకుంటూ, చంపేసుకుంటూ బతుకీడుస్తున్న వాళ్ళను నా అనుకునే వాళ్ళలో కూ