... ఆకాశం మీదఉమ్మేస్తున్నారు

వంశీ కలుగోట్ల // ... ఆకాశం మీదఉమ్మేస్తున్నారు // 
***************************************************
            ఓడిపోయినవాళ్ళు కొందరు జనాలనుతిడుతున్నారు. డబ్బు పంచలేదు, సారా తాపలేదు కాబట్టి ఓడిపోయాం; మతం, కులం పని చేశాయి గట్రా అంటూ తెగ బాధపడుతూ జనాలను కించపరుస్తున్నారు. అయినా మీ అభిమాన హీరో రాజకీయాల్లోకి వచ్చేదాకా జనాలు పట్టని మీరా జనాలను గురించి మాట్లాడేది. ఒక్క విషయంరా అబ్బాయిలూ మరియు అమ్మాయిలూ జనాలను విమర్శించటమంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఓటమిని హుందాగా అంగీకరించండి. జనాలకు నిజాయితీ కంటే ఎక్కువగా ఆదుకుంటారన్న భరోసా కలిగించగలగాలి. మంచితనం కంటే ఎక్కువగా సమర్థత అవసరం. మంచోడివైతే, నిజాయితీపరుడివైతే గౌరవిస్తారు - కానీ, పాలించాలంటే సమర్థత కావాలి. 
            నాకు ఇక్కడ సగటు విద్యార్థి తీరు గుర్తొస్తోంది - 'దేవుడా ప్రతి శనివారం గుడికొస్తాను, గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను, నూటొక్క టెంకాయలు కొట్టాను, ఇంకా చాలా చేసాను అయినా నేను ఫెయిల్ అయ్యాను; ఏనాడూ గుడికి రాని వాడు పాస్ అయ్యాడు; ఇది దారుణం' అనుకుంటారు చూడు, అలాంటివారిని చాలామందిని చూశాను. విద్యార్థులే కాదు, ఉద్యోగాల్లో ఎదగని వారూ అలానే అనుకుంటారు (చాలామంది). మంచోడివైతే పరీక్ష పాస్ కారు; చదవాలి, చదివింది గుర్తుంచుకుని పరీక్షలో ప్రశ్నకు సరియైన సమాధానం రాయాలి - అపుడే పాస్ అవుతారు. పాస్ అయిన ప్రతోడు కాపీ కొట్టి పాస్ అయ్యాడని అనడం ఈజీ; ప్రమోషన్ వచ్చిన ప్రతోడూ పైవాడిని కాకా పెట్టాడని అనటం ఇంకా ఈజీ. ఇపుడు వీళ్ళ తీరూ అలానే ఉంది. 
            అయినా వీళ్ళు గుర్తించని అంశమేమిటంటే - అలా కేవలం డబ్బు మాత్రమే పని చేసేట్టయితే అధికారంలో ఉన్న పార్టీ ఎప్పటికీ అధికారంలోనే ఉంటుంది. సమర్థత, భరోసా ఇవ్వలేని వారిని డబ్బులు పంచినా, ఇంకేం చేసినా ఓడిస్తారు. అలా కాక సమర్థులు, భరోసా ఇవ్వగలరు అనుకుంటే డబ్బులివ్వకున్నా గెలిపిస్తారు ... ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి, పరిశీలించుకోండి. అలా కాక జనం మీద తప్పు తోసేస్తే, మళ్ళీ ఇటువంటి అనుభవాలకు సిద్ధంగా ఉండండి. గుర్తుంచుకోండి - మీరు ఆకాశం మీద ఉమ్మేస్తున్నారు. 

Comments

  1. ఈ పదవులు ప్రజలు పెట్టే భిక్షని తెలుసుకున్నవాడే ప్రజాస్వామ్యంలో నిలబడతాడు. ఈ మాత్రం సోయి పచ్చ బాచీకి ఉందని అనిపించడం లేదు.

    ఆడలేక మద్దెలోడు అన్న చందాన ఈవీఎం/మోడీ/కెసిఆర్/ప్రశాంత్ కిషోర్/రాం గోపాల్ వర్మ అంటూ ఏడుపులు ఒక్కటీ. నిన్నటి నుంచి సామాజిక (వర్గ) మీడియాలో కొందరు పొటాష్ గాంగ్ సభ్యులు "సారీ సీఎం సార్, మీరు ఇంత చేసినా మేము బాగా పని చేయలేదు కనుకే చతికిల పడ్డాం" అని స్వామి భక్తి చాటుకుంటున్నారు :)

    ReplyDelete
    Replies
    1. అవును, మరీ చిరాకు పుట్టిస్తున్నారు

      Delete
  2. https://twitter.com/satishacharya/status/1131824809371942912

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన